30, జూన్ 2012, శనివారం

తవ్వ

        తవ్వ
కొలిచేది తవ్వ
తినేది బువ్వ
ఎగిరేది గువ్వ
మోగేది మువ్వ
అవ్వకు మాత్రం లేదు బువ్వ

28, జూన్ 2012, గురువారం

ఉప్పు

        ఉప్పు
తినేది ఉప్పు
తొడిగేది చెప్పు
చేసేది తప్పు
చెయ్యకు అప్పు
తెచ్చు కోకు ముప్పు

27, జూన్ 2012, బుధవారం

భోజనం@@@

         భోజనం
అందరికీ కావాలి

 భోజనం
అందరికీ ఇష్టమైనది

 దద్దోజనం
కార్తీక మాసం లో తోటల్లోచేసే భోజనం

 వనభోజనం
అందరూ వరసలోకూర్చొని తినే భోజనం

  పంక్తి భోజనం
బ్రహ్మ నాయుడు పెట్టింది 

సహ పంక్తి భోజనం

21, జూన్ 2012, గురువారం

గువ్వ

    గువ్వ
ఎగిరేది గువ్వ
తినేది బువ్వ
నడవలేనిది అవ్వ
కొలవడానికి తవ్వ
కూరకి పనికి వచ్చేది దవ్వ
మోగేది మాత్రం మువ్వ

19, జూన్ 2012, మంగళవారం

చెప్పు

      చెప్పు
కాలికి చెప్పు
పెల్లికి డప్పు
కూరకి ఉప్పు
ఎప్పుడూ చెయ్యకు తప్పు

18, జూన్ 2012, సోమవారం

మామిడి

             మామిడి
రుచికరమైనది మామిడి
తియ్యగా ఉండేది చలిమిడి
పారవేసేది చీమిడి
ఎక్కువ గా తినలేనిది జీడిమామిడి
నవ్వించేది మాత్రం కామెడి

గాడిద

          గాడిద
అరిచేది గాడిద
అరవనిది బూడిద
వడ్రంగికి కావాలి బాడిద
చాకలికి కావలి గాడిద
సాధువుకి కావాలి బూడిద

జలము

       జలము
తాగేది జలము
పాడేది గలము
పెరిగేది బలము
రైతుకి కావాలి హలము
చ్చెప్పకు ఆలము

17, జూన్ 2012, ఆదివారం

దర్జీ

            దర్జీ
బట్టలు కుట్టేది దర్జీ
వ్రాసి ఇచ్చేది అర్జీ
తినేది బజ్జి
వచ్చేది గజ్జి
కొందరి పేరేమో బుజ్జి
పోటీలో ఉండాలి సమాన ఉజ్జి

కోక

        కోక
కట్టేది కోక
ఊదేది బాకా
పట్టేది  కాకా
పట్టే     కాకా
మీకా మాకా

గువ్వ

       గువ్వ
ఎగిరేది గువ్వ
తినేది బువ్వ
నడవలేనిది అవ్వ
కొలవడానికి తవ్వ
కూరకి పనికి వచ్చేది దవ్వ
మోగేది మాత్రం మువ్వ

పండు

        పండు
తినేది పండు
తినలేనిది గుండు
గుండుతో ఎండలోకి వెల్తే మండు
తలకి పట్టేది చుండు
పట్టకుండా జాగ్రత్తగా ఉండు

16, జూన్ 2012, శనివారం

గన్నేరు

         గన్నేరు
పూసేది గన్నేరు
ముంచేది మున్నేరు
ఏడిస్తే వచ్చేది కన్నీరు
జల్లేది పన్నీరు
తాగేది మాత్రం తేనీరు

14, జూన్ 2012, గురువారం

కుంకం బొట్టు

               కుంకం బొట్టు
నుదుటికి పెట్టుకొనేది కుంకంబొట్టు
నుదుటికి పెట్టుకోలేనిది నీటిబొట్టు
మెడలో కట్టించుకొనేది తాళిబొట్టు
అందరికీ ఇష్టమైనది బొబ్బట్టు

గోపురం


             గోపురం
మా ఊరు ఆత్రేయపురం
మాఊరు లో ఉంది పెద్ద గోపురం
దానిమీద ఉంది ఓ పావురం
చెయ్యాలి గుట్టుగా కాపురం

13, జూన్ 2012, బుధవారం

దారము

          దారము
కుట్టేందుకు దారము
కూరకి కావాలి కారము
ఆఫీసుకి శలవు ఆదివారము
భూమికి ఉండాలి సారము
అవకు తల్లిదండ్రులకు భారము

గులాబి

          గులాబి
అందమైనది గులాబి
తియ్యనైనది   జిలేబి

దీపావళికి కాల్చేది మతాబి

బుర్ర


            బుర్ర
ఊత నిచ్చేది కర్ర
ఆలోచించేది బుర్ర
భూమిని గుల్లచేసేది ఎర్ర
రుచికోసం వాడేది జీలకర్ర

తొక్క


         తొక్క
మెరిసేది చుక్క
అరిచేది కుక్క
చేసేది లెక్క
తినేది వక్క
పడుకోడానికి కావాలి పక్క
తినలేనిది తొక్క

12, జూన్ 2012, మంగళవారం

బొగ్గు

           బొగ్గు
నల్లగా ఉండేది బొగ్గు
తెల్లగా ఉండేది ముగ్గు
పెల్లికూతురు పడేది సిగ్గు
తాతకి కావాలి రగ్గు
బిడ్డలకి పట్టేది ఉగ్గు
మాతాత ఎప్పుడూ దగ్గు తాడు దగ్గు

వంటకము


        వంటకము
తినేది వంటకము
తినలేనిది టంకము
గుచ్చు కొనేది కంటకము
అడ్డుపెడితే వచ్చేది  ఆటంకము

11, జూన్ 2012, సోమవారం

కరివేపాకు

                కరివేపాకు
కూరలో వేసేది కరివేపాకు
కరివేపాకులో దాక్కున్నది వేపాకు
ఏ చెట్టుకూ లేని ఆకు చిరాకు ,పరాకు
రోడ్డు మీదమాత్రం నడవకు పరాకు గా

కర్మము

             కర్మము
చెయ్యాలి చేతనైన ధర్మము
తప్పించుకోలేనిది కర్మము
అందరికీ చెప్పకు మర్మము

అందరూ మొక్కేది కూర్మము

బెల్లము

           బెల్లము
తియ్యగా ఉండేది బెల్లము
తియ్యగా లేనిది అల్లము
శుభ్రంగా ఉంచేది కల్లము
తినడానికి పళ్ళెము
తలుపుకి కావాలి గొళ్ళెము
గుర్రాన్ని అదుపులో ఉంచేది కళ్ళెము

మాతాత




          మాతాత
మాతాత కి పెద్ద పొట్ట
కడతాడు ఖద్దరు బట్ట
ఎక్కలేడు గుట్ట
ఎత్తలేడు తట్ట
కూరకి తెచ్చేడు తాటి మిట్ట
వద్దన్నా కాలుస్తాడు పెద్ద చుట్ట  


10, జూన్ 2012, ఆదివారం

గొప్పలు


            గొప్పలు
నీటిలో ఉండేవి కప్పలు
చేపకి కావాలి మొప్పలు
తినేవి చుప్పులు
పెల్లికి కావాలి డప్పులు
వచ్చేవి నొప్పులు
రైతులు వేసేవి కుప్పలు
చెప్పకు గొప్పలు

వాయసము



          వాయసము
ఎగిరేది వాయసము
ఎగరలేనిది  రాయసము
తినేది  పాయసము
తినలేనిది  ఆయాసము 

వానరము

         వానరము
దేవున్ని కోరేది వరం
దేవున్ని కోరనది జ్వరం
రక్తం ప్రవహించేది నరం
చెట్టుకు వేలాడేది వానరం
బట్టలు కుట్టేది దారం
బట్టలు కుట్టలేనిది

 మందారం

ఆర్యుడు

            ఆర్యుడు
పూజింపబడేవాడు ఆర్యుడు
లోకభాంధవుడు సూర్యుడు
అశోకచక్రవర్తి ఓ మౌర్యుడు

మువ్వలు

          మువ్వలు
మోగేవి మువ్వలు
ఎగిరేవి గువ్వలు
దీపావాళికి కాల్చేవి  జువ్వలు
పూజకు కావాలి పువ్వులు
చిమ్మిలికి కావాలి నువ్వులు

వాయసము

          వాయసము
ఎగిరేది వాయసము
తినేది పాయసము
మహారాజుకి ఉండాలి రాయసము
మనకి ఉండకూడదు రాయసము
పెంచకు భారీగా కాయము
తెచ్చుకోకు భారీగా ఆయాసము

గోరు


          గోరు
పెరిగేది గోరు
కోరేది కొబ్బరి కోరు
తినేది నోరు
తగ్గాలి జోరు
వేసుకోవాలి మారు
పెంచుకోకు పోరు
పారేసుకోకు నోరు
అదుపులో ఉంచాలి జోరు

9, జూన్ 2012, శనివారం

విభూతి


            విభూతి
స్నానంచేసిన తరువాత నుదుట
ధరించాలి విభూతి
మెల్లగా నడిచేది భూతి
అనుభవిస్తే గాని రానిది
అనుభూతి
ఇతరులపై చూపించేది
సానుభూతి

ప్రగతి

            ప్రగతి
అన్నింటిలో ఉండాలి ప్రగతి
దేవున్ని కోరాలి గతి
కాపాడాలి అందరూ జగతి
కాపాడక పోతే అందరం ఔతాం అధోగతి

ఓటు

               ఓటు
పద్ధెనిమిదేల్లకి వస్తుంది ఓటు
ఓటు అంటే నోటు కాదు
నాయకున్ని ఎన్నుకొనేదే ఓటు
అమ్ముకోకు వందకి నీ ఓటు
అమ్ముకోకు మందుకి నీ ఓటు
భందువైనా మంచివాడు కాకపోతే

 వెయ్యకు నీ ఓటు
మంచివారిని ఎన్నుకో
మంచి పౌరుడు అనిపించుకో 
ప్రజాస్వామ్యాన్ని కాపాడు
గాంధీజీ ఆశయాలు పెంచు 
గాడ్సే
శయాలు తుంచు  

తెలుసుకో

            తెలుసుకో
ఆకలి వేసివనప్పుడు
అన్నం తినకుండా ఉండు
ఆకలి భాదేంటో తెలుస్తుంది
ఎండలో నిలబడు ఓ గంట
కూలి కోసం కూలి వాడు పడే
భాదేంటో తెలుస్తుంది
చలికాలం లో కప్పు కో కుండా  ఉండు
చలి భాదేంటో తెలుస్తుంది  నీకు
ఈభాదలన్నీ నీకు లేనందుకు ఆనందించు
ఈసుఖాలన్నీ నీకు భగవంతుడు
ఇచ్చినందుకు క్రుతజ్ఞతలు తెలుపు
మనిషిగా పుట్టినందుకు
సాటిమనిషిని గౌరవించు  
ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు
వాడి కల్లలో ఆనందం చూడు
మనిషిగా జీవించు

మానవత్వాన్ని మన్నించు

చలి

           చలి
తినలేనిది చలి
తినేది బచ్చలి
వేసవకాలం లో చలి
చలివేంద్రం లో ఉంటుంది చలి

ఆలోచించు_ఆచరించు



                  ఆలోచించు_ఆచరించు
మీఊరిచెరువులో నీరు ఎవరు పాడుచేస్తున్నారు
మీవీధి లో రోడ్డు ఎవరు పాడుచేస్తున్నారు
మీ ఇంట  ముంగిట నున్న కాలువలో చెత్త ఎవరు పోస్తున్నారు
ఎవరు మీఊరు వస్తున్నారు
ఎవరు మీఊరు పాడుచేస్తున్నారు 
ఎవరూ వచ్చి మీఊరు పాడుచెయ్యడం లేదు
ఆలోచించు నువ్వు, ,మీరు,మనమే ,మన ఊరువారే
మన ఊరు పాడుచేస్తున్నారు
మందుగా నువ్వు మారు
నీపక్కవారిని మార్చు
ఒకర్ని చూసి ఒకరు మారండి
పక్కవారిని మార్చండి
ఊరు బాగు కోరండి
అందరి బాగు కోరండి

ఆరోగ్యంగా ఉండండి

7, జూన్ 2012, గురువారం

పాము

        పాము
కరిచేది పాము
నోచేది నోము
తినేది వాము
మొఖానికి రాసేది క్రీము
పొందాలి గోము
పాత్రలు శుభ్రంగా తోము

6, జూన్ 2012, బుధవారం

నల్లి


               నల్లి
కరిచేది నల్లి
అందరి ఇంట్లో ఉండేది బల్లి
ముద్దొచ్చేది చిట్టి చెల్లి
అందరికీ ఇ ష్టమైనది  తల్లి
తల్లి లాంటిది ఉల్లి
అందుకే తినాలి రోజూ ఉల్లి 
తినకు మాత్రం కారా కిల్లి   

5, జూన్ 2012, మంగళవారం

ఆకు కూర

 ఆకు కూర
తినేది కూర
ఊదేది బూర
మల్లెపూలు కొనేది మూర
రైతుకు అవసరం పార

అప్పుడప్పుడు తినాలి ఆకు కూర

నాచు

        నాచు
నీటిలో ఉండేది నాచు
కిల్లీలో వేసేది కాచు
వడగాలి వీచు
సరిగా తూచు
పాపాయి ఉయ్యాలి ఊచు

మూక

       మూక
ఊపేది తోక
పాడుచేసేది కోతిమూక
పారేసేది ఊక
కట్టేది కోక

కంపు


            కంపు
మల్లెల వాసన ఇంపు
కుల్లితే వచ్చేది కంపు
వరదలొస్తే వచ్చేది ముంపు
ఎర్రగా ఉండేది కెంపు
రోకలితో చేసేది దంపు