4, డిసెంబర్ 2012, మంగళవారం

tamashaprasnalu@








20, నవంబర్ 2012, మంగళవారం

జెర్రిa

         జెర్రి
వేగంగా నడిచేది జెర్రి
గుడ్డిగా నమ్మేది గొర్రి
గుమస్తా వేసేది కొర్రి
ముందుపల్లు లేకపోతే తొర్రి
ఎక్కువ నీడ నిచ్చేది మర్రి
నీకు లేదని అవకు ఎప్పుడూ వర్రి

17, అక్టోబర్ 2012, బుధవారం

తల్లి

         తల్లి
బుజ్జగించేది తల్లి
కరిచేది నల్లి
నమిలేది కిల్లి
ముద్దొచ్చేది చెల్లి
మేలు చేసేది మాత్రం ఉల్లి

26, సెప్టెంబర్ 2012, బుధవారం

పాయసంa


             పాయసం
నల్లగా ఉండేది వాయసం
తియ్యగా ఉండేది పాయసం
పరుగెత్తితే వచ్చేది ఆయాసం
శ్రీరాముడు చేసింది వనవాసం
మనం వారానికోసారి చెయ్యాలి
ఆరోగ్యం కోసం  ఉపవాసం   

24, సెప్టెంబర్ 2012, సోమవారం

a సిపాయి



            సిపాయి
బోర్డర్ లో సిపాయి
వంట ఇంట్లో ఉల్లిపాయి
పాపాయి నోట్లో మిఠాయి 
మిఠాయి కొనడానికి కావాలి రూపాయి  

వెంకి A

   వెంకి
ఆమె పేరేమో ఎంకి
ఎంకి  కి ఉన్నాడు తమ్ముడు వెంకి
వెంకి మహా పెంకి
వెంకి ఓరోజు తెచ్చాడు ఓ మామిడి టెంకి
టెంకిని పాతాడు వెంకి
టెంకిలోంచి వచ్చింది ఓమామిడి మొక్క
వెంకి మొక్క పెద్దదై  మానవులకు
ఎన్నో పండ్ల నిచ్చింది
భూమ్మీద  ఎన్నో మొక్కలు మొలవడానికి
టెంకిలు ఇచ్చింది
ఇప్పుడు వెంకి కాదు పెంకి 
ఇప్పుడు అయ్యాడు  వెంకి
మామంచి వెంకి
మంచిపనులు చెయ్యండి
మంచివారనిపించుకొండి

        _అయ్యగారి రామక్రిష్న


         

27, ఆగస్టు 2012, సోమవారం

కాకి a

   కాకి
ఎగిరేది కాకి
ఎత్తేది జాకి
తీర్చవలసింది బాకి
నాకు రాదు హాకి
అన్నయ్యకి కట్టేది రాఖి

14, ఆగస్టు 2012, మంగళవారం

వెలుగు



        వెలుగు
దీపం ఇచ్చేది వెలుగు
ఎలుక ఉండేది కలుగు
నల్లగా ఉండేది ఎలుగు
రైతుకి కావాలి పలుగు
పాపాయికి పెట్టాలి నలుగు

చలిమిడి

      చలిమిడి
పూసేది మామిడి
కారేది చీమిడి
తినేది చలిమిడి
తినలేనిది ఉమ్మడి

13, ఆగస్టు 2012, సోమవారం

బడి

           బడి
రైతులకి ఇష్టం 

దిగుబడి
వ్యాపారస్తులకి ఇష్టం

 రాబడి
పిల్లలకి ఇష్టం బడి
పిల్లలలు లేని బడి 

 పెట్టుబడి
అందరూ భయపడేబడి 

చేతబడి       

1, ఆగస్టు 2012, బుధవారం

ముత్యం

         ముత్యం
మెరిసేది ముత్యం
రోగికి పెట్టాలి పథ్యం
పలకాలి ఎప్పుడు

 సత్యం
పలకకు ఎప్పుడు

 అసత్యం
భగద్గీత పారాయణ 

చెయ్యాలి నిత్యం

27, జులై 2012, శుక్రవారం

వెదురు

                  వెదురు
రాట్నానికి కావాలి కదురు
బుట్టకి కావాలి వెదురు
పనికిరానిది ముదురు
తల్లిదండ్రుల మాటకు 

తిరగకు ఎదురు

26, జులై 2012, గురువారం

ముంపు

       ముంపు
నీరు తెచ్చేది పంపు
మురిగితే వచ్చేది కంపు
వరదొస్తే వచ్చేది ముంపు
ఇష్టమైతే ఇంపు లేకపోతే కంపు

25, జులై 2012, బుధవారం

ఉడత

      ఉడత
ఎగిరేది ఉడత
కాసేది కడత
బాగుండాలి మడత
పాపాయికి కావాలి లక్క పిడత

24, జులై 2012, మంగళవారం

బంతి


         బంతి
ఎగిరేది బంతి
ఎగరలేనిది కుంతి
అందరికీ కావాలి కాంతి
గౌరవించాలి అందరూ ఇంతి

22, జులై 2012, ఆదివారం

పసరు

          
పసరు
 
గాయానికి వే
సేది పసరు
కొంటే ఇచ్చేది కొసరు
శ్రావనమాసం లో పెట్టేది ముసురు
అమ్మ వంటకు పెట్టేది ఎసరు
పోసుకోకు ఎవరి ఉసురు

దీపం


         దీపం
వెలిగించేది దీపం
వేసేది ధూపం
నచ్చకపోతే వచ్చేది కోపం
చెయ్యకు పాపం
పొందకు శాపం

ఆలోచించండి_ఆచరించండి


ఆలోచించండి_ఆచరించండి

ramakrishnaa

ఆలోచించండి_ఆచరించండి
ఎగిరే బంతికి తెలుసు
తాను కిందే పడతానని
పొద్దున్నే వికసించే పుష్పానికి తెలుసు
తాను సాయంత్రానికి తెలుసు వాడిపోతానని
ప్రవహించే ప్రవాహానికి తెలుసు
తాను చివరికి సముద్రంలో కలుస్తానని
మనిషికీ తెలుసు
తానెప్పటికైనా చనిపోతానని
ఐనా స్వార్ధం వీడడు
ధర్మాన్ని ఆచరించడు
ప్రక్రుతిని చూసి నేర్చుకోండి
ఉన్నంత సేపు ఇతరులకి
ఆనందాన్ని ఇవ్వాలని
ఆనందంగా జీవించాలని
ధర్మాన్ని ఆచరించండి
ఆనందంగా జీవించండి