

ఆమె పేరేమో ఎంకి
ఎంకి కి ఉన్నాడు తమ్ముడు వెంకి
వెంకి మహా పెంకి
వెంకి ఓరోజు తెచ్చాడు ఓ మామిడి టెంకి
టెంకిని పాతాడు వెంకి
టెంకిలోంచి వచ్చింది ఓమామిడి మొక్క
ఆ వెంకి మొక్క పెద్దదై మానవులకు
ఎన్నో పండ్ల నిచ్చింది
భూమ్మీద ఎన్నో మొక్కలు మొలవడానికి
టెంకిలు ఇచ్చింది
ఇప్పుడు వెంకి కాదు పెంకి
ఇప్పుడు అయ్యాడు వెంకి
మామంచి వెంకి
మంచిపనులు చెయ్యండి
మంచివారనిపించుకొండి
_అయ్యగారి రామక్రిష్న
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి