

ఎగిరే బంతికి తెలుసు
తాను కిందే పడతానని
పొద్దున్నే వికసించే పుష్పానికి తెలుసు
తాను సాయంత్రానికి తెలుసు వాడిపోతానని
ప్రవహించే ప్రవాహానికి తెలుసు
తాను చివరికి సముద్రంలో కలుస్తానని
మనిషికీ తెలుసు
తానెప్పటికైనా చనిపోతానని
ఐనా స్వార్ధం వీడడు
ధర్మాన్ని ఆచరించడు
ప్రక్రుతిని చూసి నేర్చుకోండి
ఉన్నంత సేపు ఇతరులకి
ఆనందాన్ని ఇవ్వాలని
ఆనందంగా జీవించాలని
ధర్మాన్ని ఆచరించండి
ఆనందంగా జీవించండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి