27, జులై 2012, శుక్రవారం

వెదురు

                  వెదురు
రాట్నానికి కావాలి కదురు
బుట్టకి కావాలి వెదురు
పనికిరానిది ముదురు
తల్లిదండ్రుల మాటకు 

తిరగకు ఎదురు

26, జులై 2012, గురువారం

ముంపు

       ముంపు
నీరు తెచ్చేది పంపు
మురిగితే వచ్చేది కంపు
వరదొస్తే వచ్చేది ముంపు
ఇష్టమైతే ఇంపు లేకపోతే కంపు

25, జులై 2012, బుధవారం

ఉడత

      ఉడత
ఎగిరేది ఉడత
కాసేది కడత
బాగుండాలి మడత
పాపాయికి కావాలి లక్క పిడత

24, జులై 2012, మంగళవారం

బంతి


         బంతి
ఎగిరేది బంతి
ఎగరలేనిది కుంతి
అందరికీ కావాలి కాంతి
గౌరవించాలి అందరూ ఇంతి

22, జులై 2012, ఆదివారం

పసరు

          
పసరు
 
గాయానికి వే
సేది పసరు
కొంటే ఇచ్చేది కొసరు
శ్రావనమాసం లో పెట్టేది ముసురు
అమ్మ వంటకు పెట్టేది ఎసరు
పోసుకోకు ఎవరి ఉసురు

దీపం


         దీపం
వెలిగించేది దీపం
వేసేది ధూపం
నచ్చకపోతే వచ్చేది కోపం
చెయ్యకు పాపం
పొందకు శాపం

ఆలోచించండి_ఆచరించండి


ఆలోచించండి_ఆచరించండి

ramakrishnaa

ఆలోచించండి_ఆచరించండి
ఎగిరే బంతికి తెలుసు
తాను కిందే పడతానని
పొద్దున్నే వికసించే పుష్పానికి తెలుసు
తాను సాయంత్రానికి తెలుసు వాడిపోతానని
ప్రవహించే ప్రవాహానికి తెలుసు
తాను చివరికి సముద్రంలో కలుస్తానని
మనిషికీ తెలుసు
తానెప్పటికైనా చనిపోతానని
ఐనా స్వార్ధం వీడడు
ధర్మాన్ని ఆచరించడు
ప్రక్రుతిని చూసి నేర్చుకోండి
ఉన్నంత సేపు ఇతరులకి
ఆనందాన్ని ఇవ్వాలని
ఆనందంగా జీవించాలని
ధర్మాన్ని ఆచరించండి
ఆనందంగా జీవించండి

సందు

           సందు
దూరలేనిది సందు
తాగేది మందు
నాయకులు చేసేది బందు
పీక్కు తినేది రాబందు
జాగ్రత్తగా కాపాడాలి పసికందు

కండి

         కండి
మా ఊరు ఉండి
నాకు లేదు బండి
చెరువుకుపడింది గండి
మగ్గంలో కండి
వంట ఇంట్లో అండి
పూజించాలి చెండి
కోవెల్లో ఉండేది హుండి

20, జులై 2012, శుక్రవారం

ఆన

       ఆన
ఇచ్చేది ఆన
కురిసేది వాన
దూరలేనిది కాన
ముద్దొచ్చేది పిల్లికూన

జున్ను

          జున్ను
తినేది జున్ను
తినలేనిది మన్ను
జాగ్రత్తగా కాపాడుకోవాలి కన్ను
అనవసరంగా పేల్చకు గన్ను
రోగికి కావాలి బన్ను
అందరూ కట్టాలి పన్ను

18, జులై 2012, బుధవారం

కాక్

      కాక్
నిద్రలేపేది కాక్
అందుకోలేనిది బ్యాక్
నోరూరించేది కేక్
భయపెట్టేది స్నేక్
బరువు తగ్గేందుకు చెయ్యాలి వాక్
అనవసరంగా చెయ్యకు టాక్
ఇంటికి వెయ్యాలి మంచి లాక్

2, జులై 2012, సోమవారం

మొక్కు

             మొక్కు
దేవునికి చెల్లించేది మొక్కు
చెల్లించక పోతే వస్తుంది చిక్కు
గట్టిగా ఉండేది ఉక్కు
వాసనపసిగట్టేది ముక్కు
అప్పుల వాల్లకి ఇచ్చేది చెక్కు
చెల్లక పోతే వస్తుంది చిక్కు
అరగక పోతే వస్తుంది కక్కు
ఎంత ప్రాప్తముంటే అంతే దక్కు

1, జులై 2012, ఆదివారం

కర్ర

       కర్ర
ఊతనిచ్చేది ఊతకర్ర
కిచెన్ లో ఉండేది అప్పడాలకర్ర
పోపుకి కావాలి జీలకర్ర
రైతు కి సాయం దుడ్డుకర్ర
కరెంటు పోతే కావాలి విసనకర్ర

బూంది



        బూంది
మొక్కేది నంది
చీదరించు కొనేది పంది
తిను బూంది
తాగకు బ్రాంది 
అందరూ గౌరవించేది  గాంధి

సబ్బు

         సబ్బు
ఆకాసంలో మబ్బు
బాత్రూం లో సబ్బు
లాకర్లో డబ్బు
ఎంత దాచినా దాగనిది జబ్బు