30, ఏప్రిల్ 2012, సోమవారం

బెంచి




        బెంచి
కూర్చొనేది బెంచి
కట్టుకొనేది పంచి
పట్టుకెల్లేది సంచి
ముక్తి కోసం వెల్లు కంచి
తెచ్చిన ప్రసాదం పదిమందికి
మాత్రం పంచు
బ్రతకడానికి ఉండాలి మంచి

పాలు


     పాలు
తాగేది పాలు
నడిచేది కాలు
సరిపోతే చెప్పేది

 చాలు
మగవాడికి తోడుకావాలి

 ఆలు

సారము

     సారము
ఉండాలి భూమికి

 సారము
కూరకి తగిన

 కారము
మోపకు ఇతరుల మీద

 భారము
దండ గుచ్చేందుకు కావాలి 

దారము
ఉపవాసము చెయ్యాలి 

శనివారము

ఎసరు

        ఎసరు
అమ్మ వండడానికి

 పెట్టేది ఎసరు
నాటువైద్యులు వేసేది

 పసరు
వర్షంవదలకుండా పడితే

 ముసురు
పోసుకోకు ఎవరి

 ఉసురు

29, ఏప్రిల్ 2012, ఆదివారం

ఆకలి

          ఆకలి  
కనిపించనిది ఆకలి
కనిపించేది రోకలి
బట్టలుతికేది చాకలి
శుభ్రంగా ఉంచాలి వాకలి

సాయం

          సాయం
భారీగా పెంచకు కాయం
చెయ్యకు గాయం
ఇతరులకి చెయ్యాలి సాయం

అచ్చా_బచ్చా

      అచ్చా_బచ్చా
ఎప్పుడూ చెయ్యకు రచ్చ
అనిపించుకోకు లుచ్చా
లుచ్చా అనిపించుకోకు ఓ బచ్చా
బచ్చా అందరిచేత అనిపించుకో
వీడు మాత్రం అచ్చా_బచ్చా

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

బలము



         బలము
పెంచేది బలము
వదిలేది శరము
ఓండ్రపెట్టేది ఖరము
కత్తిరించేది  నఖము
పూజించేది దళము
పెంచాలి   యశము

రాజు



       రాజు
పాలించేది రాజు
దులిపేది బూజు
పగిలేది గాజు
తినేది   కాజు
పడకు మోజు
వెంటపడకు రోజు

26, ఏప్రిల్ 2012, గురువారం

గెలుపు



             గెలుపు
యుద్ధం లో జయిస్తే గెలుపు
ఆకాశం లో మెరిసేది మెరుపు
దేవుడుకి కట్టేది ముడుపు
పంటలో ఉండేది కలుపు
గుమ్మానికి పూసేది పసుపు
ఎవరికీ చెయ్యకు చెరుపు 

తినకు ఎక్కువ పులుపు

24, ఏప్రిల్ 2012, మంగళవారం

ఆవాలు

           ఆవాలు
పోపుకి కావాలి ఆవాలు
వంటకి కావాలి చావాలు
పిల్లలకి కావాలి కోవాలు
కోర్టులో వేసేవి దావాలు

23, ఏప్రిల్ 2012, సోమవారం

ఆరుగు


    అరుగు       
కూర్చొనేది అరుగు
కరిచేది పురుగు
ఎండితే వచ్చేది తరుగు
ఎండబెడితే అయ్యేది ఒరుగు
పాలు తోడేస్తే అయ్యేది పెరుగు

రోజూ మాత్రం తిను పెరుగు

22, ఏప్రిల్ 2012, ఆదివారం

గోవా

          గోవా
అందమైనది గోవా
భయంకరమైనది లావా


తియ్యనైనది కోవా
కోర్టులో వేసేది దావా
నేపిలిస్తే నువ్వు రావా

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

కలుపు

        కలుపు
మూసేది తలుపు
పీకి పారవేసేది కలుపు
శ్రమిస్తే వచ్చేది అలుపు
కష్టపడితే వచ్చేది గెలుపు
నచ్చనది నలుపు
తినకు ఎక్కువ పులుపు

14, ఏప్రిల్ 2012, శనివారం

తలుపు

             తలుపు
ఇంటికి  తలుపు   అవసరం
మొక్కకి కలుపు అనవసరం
ఆడవారికి సవరం   అవసరం 
మగవారికి సవరం అనవసరం

తేనీరు


      తేనీరు
తాగేది తేనీరు
కార్చేది కన్నీరు
జల్లేది పన్నీరు
స్నానానికి చన్నీరు
తాగాలి మాత్రం కాచి

 చల్లార్చిన నీరు

12, ఏప్రిల్ 2012, గురువారం

రాయి


       రాయి
ఎగిరేది పావురాయి
ఎగరనిది కిరాయి
తొడిగేది షరాయి
మనదికానిది పరాయి
తలలో పెట్టుకొనేది తురాయి

11, ఏప్రిల్ 2012, బుధవారం

కాయ



       కాయ
చెట్టుకు కాసేది 

కాయ
చెట్టుకు కాయనిది

 గుండెకాయ
పండైనా కాయాని అనేది 

 నిమ్మకాయ
అందరికీ ఇష్టమైనది

 ఆవకాయ

అత్త

         అత్త
ఇంట్లో ఉండేది అత్త
చెరువులో ఉండేది నత్త
పరుగెత్తేది గిత్త
పరుగెత్తలేనిది నత్త
పారవేసేది చెత్త

గోల్డ్

      గోల్డ్
మెరిసేది గోల్డ్
చెరగనిది ఫోల్డ్
పాతైతే    ఓల్డ్
చల్లగా ఉంటే కోల్డ్
ఎప్పుదూ ఓల్డ్ ఈజ్ గోల్డ్

కుక్కలు



       కుక్కలు
మెరిసేవి చుక్కలు
అరిచేవి   కుక్కలు
ఊలవేసేవి నక్కలు
పారవేసేవి తొక్కలు
కాల్చేవి దుక్కలు
పెంచాలి అందరూ మొక్కలు
ఎంచకు ఇతరుల   బొక్కలు

9, ఏప్రిల్ 2012, సోమవారం

నీలగిరి


   నీగిరి
చల్లగా ఉండేది 

నీలగిరి
దానికి సరిరాదు 

ఉదయగిరి
వెల్లాలి మంగళగిరి
భక్తి తో ఎక్కాలి  గిరి
మొక్కాలి శ్రీహరి

పాము

      పాము
పాకిరేది పాము
నోచేది నోము
కర్రతోచేసేది సాము
పుండు నుంచి కారేద

 చీము
పాత్రలను మాత్రం

 శుభ్రంగా తోము

గీత

    గీత
పేరు గీత
రాదు ఈత
తినదు పీత
గీతకి ఫ్రెండ్ సీత
సీతకి పీత అంటే రోత
సీతకి ఉన్నాడు ఓ తాత
తాతకి ఇష్టమైన కూర పీత

8, ఏప్రిల్ 2012, ఆదివారం

పాదరసం

        పాదరసం
తాగేది పండ్లరసం
తాగలేనిది పాదరసం
తియ్యగా ఉండేది చెరుకు రసం
తినకపోతే వచ్చేది నీరసం
అన్నంలో వేసుకొనేది మాత్రం రసం   
 

7, ఏప్రిల్ 2012, శనివారం

బెల్లము


       బెల్లము
తియ్యగా ఉండేది 

బెల్లము
తియ్యగాలేనిది 


అల్లము
వరి బాగా పండేది

 పల్లము
చేను నూర్పుకు కావాలి 

కల్లము
గుర్రాన్ని అదుపుకు అవసరం 

కళ్ళెము
తినడానికి కావాలి

 పళ్ళెము

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

పొలుసు

       పొలుసు
తినేది పులుసు


పారేసేది పొలుసు
వెసుకోనేది గొలుసు
అవకు ఎవరికీ అలుసు

కంచు



         కంచు
గట్టిగామోగేది

 కంచు
చల్లగా కురిసేది

 మంచు
తినడానికి ఉండాలి

 నంచు
ప్రసాదం పదిమందికి

 పంచు
పరిసరాలు మాత్రం

 పరిశుభ్రంగా ఉంచు

భరణము


         భరణము
ఇచ్చేది భరణము
ధరించేది ఆభరణము
కోరకు రణము
చెయ్యకుఋణము 
చెప్పకకుండా వచ్చేది

 మరణము

5, ఏప్రిల్ 2012, గురువారం

గూడూరు

       గూడూరు
ఊరేమో  గూడూరు
వాడికి లేదు గూడు

పాడేరు

        పాడేరు
ఊరేమో పాడేరు
చేసే పనేమో పాలేరు
ఈతనికి ఎవరూ లేరు
పనిలో ఈతనితో ఎవరూ
సాటి కాలేరు