తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
27, ఆగస్టు 2012, సోమవారం
కాకి a
కాకి
ఎగిరేది
కాకి
ఎత్తేది
జాకి
తీర్చవలసింది
బాకి
నాకు రాదు
హాకి
అన్నయ్యకి
కట్టేది
రాఖి
14, ఆగస్టు 2012, మంగళవారం
వెలుగు
వెలుగు
దీపం ఇచ్చేది వెలుగు
ఎలుక ఉండేది కలుగు
నల్లగా ఉండేది ఎలుగు
రైతుకి కావాలి పలుగు
పాపాయికి పెట్టాలి నలుగు
చలిమిడి
చలిమిడి
పూసేది
మామిడి
కారేది
చీమిడి
తినేది
చలిమిడి
తినలేనిది
ఉమ్మడి
13, ఆగస్టు 2012, సోమవారం
బడి
బడి
రైతులకి ఇష్టం
దిగుబడి
వ్యాపారస్తులకి ఇష్టం
రాబడి
పిల్లలకి ఇష్టం
బడి
పిల్లలలు లేని బడి
పెట్టుబడి
అందరూ భయపడేబడి
చేతబడి
1, ఆగస్టు 2012, బుధవారం
ముత్యం
ముత్యం
మెరిసేది
ముత్యం
రోగికి పెట్టాలి
పథ్యం
పలకాలి ఎప్పుడు
సత్యం
పలకకు ఎప్పుడు
అసత్యం
భగద్గీత పారాయణ
చెయ్యాలి
నిత్యం
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)